gudipoodi srihari: బాలకృష్ణలో నాకు అదే నచ్చింది: సినీ విశ్లేషకుడు గుడిపూడి శ్రీహరి

  • ఎన్టీఆర్ .. ఏఎన్నార్ పద్ధతి వేరు 
  • యాక్షన్ డ్రామాలు ఎక్కువైపోయాయి
  • తండ్రి మేనరిజమ్స్ బాలకృష్ణకి వచ్చాయి    

సినీ విశ్లేషకుడిగా గుడిపూడి శ్రీహరి సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "ఉన్నదున్నట్టుగా మాట్లాడటం .. రాయడం నాకు మొదటి నుంచి అలవాటు. ఈ మధ్య సినిమాల్లో యాక్షన్ ఎక్కువ అయిపోయింది. చిత్రీకరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. నన్నడిగితే ఎన్టీఆర్ .. నాగేశ్వరరావు తరువాత మన సినిమా ఎండ్ అయింది.

ఇప్పుడు అంతా బయోపిక్ లపై పడ్డారు. 'మహానటి' హిట్ కావడంతో అంతా బయోపిక్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. రానురాను తెలుగు సినిమా దారితప్పుతోంది. ఎన్టీఆర్ పై బాలకృష్ణ బయోపిక్ చేయడంలో అర్థం వుంది. బాలకృష్ణలో ఎన్టీఆర్ మేనరిజమ్స్ చాలా వున్నాయి. అందువలన ఆ పాత్రను ఆయన చేయడంలోను అర్థం వుంది. డబ్బుల గురించి కాకుండా .. తన తండ్రి జ్ఞాపకంగా బాలకృష్ణ ఈ సినిమా చేశాడు. అదే ఆయనలో నాకు నచ్చేది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News