Bhuma: ఎందులోకి వెళ్లాలి.. వైఎస్ఆర్ కాంగ్రెస్సా?... జనసేనా..?: డైలమాలో మంత్రి అఖిలప్రియ

  • అఖిలప్రియ పార్టీ మారనుందని టీడీపీ వర్గాల్లో చర్చ
  • చంద్రబాబు కర్నూలుకు వస్తే కలవని టూరిజం మంత్రి
  • తమ అనుచరులపై పోలీసుల దాడులను ఆపలేకపోయానని మనస్తాపం
అధికారంలో ఉండి కూడా, తమ అనుచరులపై జరుగుతున్న పోలీసుల దాడులను ఆపలేకపోయానన్న మనస్తాపంలో ఉన్న ఏపీ టూరిజం మంత్రి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలా? లేక జనసేన పార్టీలో చేరాలా? అన్న డైలమాలో ఆమె ఉందని తెలుస్తోంది. ఇటీవల అఖిల ప్రియ ప్రధాన అనుచరుల్లో ఒకరైన సంజీవ నాయుడిని అరెస్ట్ చేసి, పీడీ యాక్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అఖిలప్రియ, తన గన్ మెన్లను వెనక్కు పంపించేశారు కూడా. ఆపై సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా కర్నూలు జిల్లాకు వచ్చి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనగా, ఆమె మాత్రం రాలేదు. ఈ విషయంలో ముందుగానే అనుమతి తీసుకున్నానని చెప్పినా, అధికార పార్టీ వర్గాల్లో ఆమె పార్టీ మారనుందన్న చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అసలు అఖిలప్రియ మనసులో ఏముందన్న విషయం మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అఖిలప్రియ పార్టీ మారే విషయంలో టీవీ-9 ప్రసారం చేసిన ప్రత్యేక కథనాన్ని మీరు చూడవచ్చు.
Bhuma
Akhila Priya
Telugudesam
Chandrababu
YSRCP
Jana Sena

More Telugu News