ఎన్నికలకు ముందు పేరు సరిచూసుకోవడం పౌరుల బాధ్యతే: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్
- 25 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తాం
- ఫిబ్రవరి 25న తుది జాబితా
- 6 లక్షల ఓట్ల తొలగింపు
ఇప్పటి వరకూ 9,54,827 అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయని.. అలాగే ఓటు తొలగింపు కోసం పదివేల దరఖాస్తులు వచ్చాయని రజత్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో 6 లక్షల ఓట్ల తొలగింపు జరిగిందని.. ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో పేరు సరిచూసుకోవడం పౌరుల బాధ్యతేనన్నారు. తుది ఓటరు జాబితా ముద్రణ తర్వాత ఓట్ల తొలగింపు, డబుల్ ఓట్లను తొలగించడం కుదరదని రజత్ కుమార్ స్పష్టం చేశారు.