charan: నాన్నగారి బాటలో నడవాలనే నిర్ణయించుకున్నాను: చరణ్

షార్ట్స్‌లో చూడండి
చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో నిర్మితమైన 'వినయ విధేయ రామ' .. ఈ నెల 11వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చరణ్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఇది బోయపాటి మార్క్ సినిమా అయినప్పటికీ, అన్నిరకాల ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది.

ఈ సినిమాకి పవర్ఫుల్ టైటిల్ కావాలని నేను అడగలేదు. బోయపాటి గతంలో పెట్టిన 'జయ జానకి నాయక' టైటిల్ నాకు నచ్చిందని చెప్పాను. దాంతో ఆయన అదే తరహాలో ఈ సినిమాకి ఒక మంచి టైటిల్ పెట్టారు. నా ప్రతి సినిమా 'రంగస్థలం' మాదిరిగా ఉండాలంటే కుదరదు. ఇకపై అన్నిరకాల జోనర్స్ లో సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. నాన్నగారు అన్నిరకాల జోనర్స్ లో నటించి మెప్పించారు. నేను కూడా అదే బాటలో నడవాలనే నిర్ణయించుకున్నాను .. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిందే 'వినయ విధేయ రామ' అని చెప్పాడు. 
Go Back to Shorts
charan
kiara

More Telugu News