Kurnool District: కర్నూలు జిల్లాలో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన చంద్రబాబు

  • అల్ట్రా మెగా సోలార్ పార్క్ జాతికి అంకితం
  • ఫార్మా క్లస్టర్, ఎంఎస్ఎంయూ పార్కులకు భూమి పూజ 
  • వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలి
  • దీనిపై కేంద్రం వెంటనే స్పందించాలి: చంద్రబాబు

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు వద్ద నిర్మించిన విమానాశ్రయాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు ప్రారంభించారు. ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో నిర్మించిన అల్ట్రా మెగా సోలార్ పార్క్ ను జాతికి అంకితం చేశారు. అదేవిధంగా, ఫార్మా క్లస్టర్, ఎంఎస్ఎంయూ పార్కులకు చంద్రబాబు భూమి పూజలు చేశారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత, కోసిగిలో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని, దీనిపై కేంద్రం వెంటనే స్పందించాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందునే అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. వాల్మీకులకు చేతి వృత్తులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం రూ.100 కోట్లు కేటాయించి త్వరలోనే ఆ నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని భరోసా కల్పించారు. వాల్మీకి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధపెట్టి చదివించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.   

More Telugu News