PARLIAMENT: అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం!

  • 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు నిర్ణయం
  • లాభపడనున్న అగ్రవార్ణాల పేదలు
  • 124వ రాజ్యాంగ సవరణ చేపట్టే అవకాశం

దేశంలోని అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లును కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సభలో అధికార విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగుతున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారాలంటే 124వ రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉభయ సభలు ఈ బిల్లును మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది.

2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం కింద విద్య, ఉద్యోగాల్లో ఓసీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ఈ కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుత్ లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కలిపి ఉన్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే ఈ బిల్లు చట్టంగా మారితే మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతానికి చేరుకుంటాయి.

More Telugu News