'మరో చరిత్ర' సినిమా కోసం నా పేరు మార్చారు: సీనియర్ హీరోయిన్ సరిత
- మాది గుంటూరు దగ్గర మునిపల్లె
- అమ్మానాన్నలు పెట్టిన పేరు 'అభిలాష'
- 'సరిత'గా బాలచందర్ గారు మార్చారు
మా అమ్మానాన్నలది గుంటూరు జిల్లా మునిపల్లె గ్రామం. నా అసలు పేరు 'అభిలాష' అయితే దర్శకుడు బాలచందర్ గారు .. ఆత్రేయ గారు కలిసి, 'మరో చరిత్ర' ఆడిషన్స్ సమయంలో నా పేరును 'సరిత'గా మార్చారు. తమిళ ప్రేక్షకులు 'అభిలాష' అనే పేరును యాసగా పలుకుతారనే ఉద్దేశంతో నా పేరును మార్చారు. అప్పటి నుంచి 'సరిత'గానే నా కెరియర్ కొనసాగింది. స్టార్ డమ్ వచ్చాక మా సొంతవూరు వెళ్లడం కుదరలేదు" అని చెప్పుకొచ్చారు.