Crime News: బైక్ ను ఢీకొన్న కారు... ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడిన యువతి దుర్మరణం!

  • న్యూఢిల్లీ బారాపుల్లా ఫ్లయ్ ఓవర్ పై ఘటన
  • పెళ్లికి వెళ్లి వస్తున్న యువ జంట
  • కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీలోని ఓ ఫ్లయ్ ఓవర్ పై బైక్ మీద వెళుతున్న జంటను ఓ కారు ఢీకొనగా, యువతి (30) దుర్మరణం చెందింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తన భర్తతో కలిసి త్రిలోకపురి ప్రాంతంలో జరిగిన ఓ వివాహానికి వెళ్లిన యువతి, తిరుగు ప్రయాణంలో బారాపులా ఫ్లయ్ ఓవర్ పైకి చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది.

పదవీ విరమణ చేసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నడుపుతున్న ఓ కారు ఢీకొనడంతో ఆ వేగానికి బైక్ పై కూర్చుని ఉన్న యువతి, ఫ్లయ్ ఓవర్ పై నుంచి కిందపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో యువతి భర్త తల, కాళ్లకు గాయాలు అయ్యాయి. కేసును నమోదు చేసుకున్నామని, కారును నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేశామని ఢిల్లీ సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ తెలిపారు.
Crime News
New Delhi
Road Accident

More Telugu News