మేమే చస్తున్నాం... 20 రోజుల ముందు వచ్చి థియేటర్లంటే ఎలా?: 'పేట' నిర్మాతపై దిల్ రాజు ఫైర్
- పేటకు థియేటర్లు ఇవ్వలేదన్న వల్లభనేని
- తొందరపడి స్టేట్ మెంట్లు ఇచ్చారన్న దిల్ రాజు
- మూడు సినిమాలు ఆరు నెలల క్రితమే అనౌన్స్ అయ్యాయని వ్యాఖ్య
వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్2' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పక్క రాష్ట్రం నుంచి 20 రోజుల ముందు సినిమాను కొనుక్కుని వచ్చి సంక్రాంతికి విడుదల చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు. థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేయగలమని విమర్శించారు. డబ్బింగ్ సినిమా 'సర్కార్', 'నవాబ్' వంటి సినిమాలను ఎన్ని థియేటర్స్ లో కావాలంటే అన్ని థియేటర్లలో వేసుకున్నారని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు దొరకడం లేదని అంటున్నారని అన్నారు.