central government: ఈబీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రకాశ్‌ అంబేద్కర్

  • అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ల నిర్ణయం తప్పు
  • రాజ్యాంగ సంస్థలను దెబ్బతీసే చర్యలు తగదు
  • గతంలో ఇలాంటి నిర్ణయం చెల్లుబాటు కాలేదు

అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ కు రాబోతోంది. ఈ నిర్ణయాన్ని కొన్ని విపక్షాలు వ్యతిరేకిస్తుండగా, బీజేపీ మాత్రం ఈ బిల్లు పాసవుతుందన్న ధీమాతో ఉంది.

ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. రాజ్యాంగ సంస్థలను దెబ్బతీసే చర్యల్లో భాగంగానే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని విమర్శించారు. గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు కాలేదని గుర్తుచేశారు. 

More Telugu News