Hemalatha: హైదరాబాదులో బావర్చి హోటల్‌కు జీహెచ్‌ఎంసీ షాక్.. వెంటనే దారికొచ్చిన యాజమాన్యం!

  • హోటల్‌పై రైడ్ చేసిన ఏఎంహెచ్‌వో హేమలత
  • వ్యర్థాలను మ్యాన్‌హోల్‌లోకి వదులుతున్నారు
  • తడి, పొడి చెత్తను వేరు చేయడం లేదు

వ్యర్థ పదార్థాల నిర్వహణను చేపట్టకపోవడంతో ఆగ్రహించిన జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బావర్చి హోటల్‌ను సీజ్ చేశారు. తడి, పొడి చెత్తలను వేరు చేయాలని ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్‌ యంత్రాన్ని పెట్టుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తూ... 2016 నుంచి నోటీసులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-15 ఏఎంహెచ్‌వో డాక్టర్‌ హేమలత నేతృత్వంలో అధికారులు, సిబ్బంది కలిసి హోటల్‌పై రైడ్ చేసి మూసివేశారు. అనంతరం హేమలత మాట్లాడుతూ.. జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా హోటల్ నిర్వాహకులు వ్యర్థ పదార్థాలను మ్యాన్ హోల్‌లోకి వదులుతున్నారని మండిపడ్డారు. అయితే హోటల్‌ను సీజ్ చేయడంతో వెంటనే హోటల్ యాజమాన్యం స్పందించింది. అప్పటికప్పుడు ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ యంత్రాన్ని తెప్పించి బిగించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్‌ను తెరిచేందుకు అనుమతించారు.

More Telugu News