IAS: ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కో, కూతురికో రిజర్వేషన్ ఎందుకు?: జేపీ

  • రిజర్వేషన్లు పొందే కొన్ని కుటుంబాలకే ఉన్నత స్థాయి ఫలితాలు 
  • ఒక ఎంపీ, ఎమ్మెల్యే కుటుంబానికి రిజర్వేషన్ ఎందుకు?
  • కులం పేరిట కోటీశ్వరుల పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు?

రిజర్వేషన్లు పొందే బీసీ, ఎస్సీ, ఎస్టీ.. ఏ వర్గమైనా సరే, దాని ద్వారా లాభపడి పైకెదిగినటువంటి కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉన్నతస్థాయి ఫలితాలన్నీ దక్కుతున్నాయని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం విషయమై ఆయన స్పందించారు.

విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కో, కూతురికో రిజర్వేషన్ ఎందుకు? ఒక ఎంపీ, ఎమ్మెల్యే కుటుంబానికి రిజర్వేషన్ ఎందుకు? కులం పేరుతో కోటీశ్వరుల పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? దాని వల్ల ఏమవుతోంది, ఆ కులాల్లో నిజంగా వెనుకబడ్డ పేదలు, వివక్షకు గురవుతున్నవారు అవకాశాలు లేక కోకొల్లలుగా ఉన్నారని అన్నారు. ఆ కులాల్లో పేదలు ఎక్కువగా నష్టపోతున్నారని, డబ్బున్నవాళ్లకి, బాగా ఎదిగిన వాళ్లకి, ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా మంచి ఫలితాలు పొందిన వాళ్లకో కాదు రిజర్వేషన్లు కావాల్సింది, అణగారిన వాళ్లకని అన్నారు.

More Telugu News