sensex: అమ్మకాల ఒత్తిడికి గురై... చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 155 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 44 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • లాభపడ్డ ఇన్ఫోసిస్, మారుతి, ఓఎన్జీసీ

దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. మధ్యాహ్నం సమయంలో అమ్మకాల ఒత్తిడికి గురైనప్పటికీ... చివర్లో లాభాలను గడించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 155 పాయింట్లు పెరిగి 35,850కి చేరుకుంది. నిఫ్టీ 44 పాయింట్లు పుంజుకుని 10,772 వద్ద స్థిరపడింది.

యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మారుతి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ తదితర కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి. యస్ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

More Telugu News