nandamuri: అందరూ అభిమానించే మహానుభావుడు ఎన్టీఆర్: నందమూరి బాలకృష్ణ

  • ‘కథానాయకుడు’ బుధవారం విడుదల కాబోతోంది
  • నిమ్మకూరులో అందరినీ కలుద్దామని వచ్చాం
  •  నా తల్లి పాత్రలో విద్యాబాలన్ బాగా చేశారు

కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో తన తల్లిదండ్రుల విగ్రహాలకు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం, మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రం మొదటిభాగం ‘కథానాయకుడు’ బుధవారం విడుదల కాబోతోందని చెప్పారు. ఈ చిత్రం విడుదలకు ముందు ఇక్కడ అందరినీ కలుసుకుని, బంధువుల ఆశీస్సులు తీసుకుందామని వచ్చామని చెప్పారు.

‘యన్.టి.ఆర్’ కేవలం ఒక వర్గానికో, పార్టీకో పరిమితం కాదని, అందరూ అభిమానించే మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ చిత్రం రెండు భాగాలను ఇప్పటి వరకూ తొంభై రోజులు షూట్ చేశామని చెప్పారు.  నిమ్మకూరుకు రావడం ఓ మంచి అనుభూతిని కల్గించిందని విద్యాబాలన్ తనతో చెప్పారని అన్నారు. తన తల్లి బసవతారకం పాత్రను ఆమె ఎంత అద్భుతంగా ఆవిష్కరించిందో సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పారు. దర్శకుడు క్రిష్, విద్యాబాలన్ బాగా పనిచేశారని ప్రశంసించారు.

ఈరోజు ఎంతో  ప్రత్యేకం: విద్యాబాలన్

అనంతరం, నటి విద్యాబాలన్ మాట్లాడుతూ, తెలుగులో తాను నటిస్తున్న మొదటి చిత్రం ‘యన్.టి.ఆర్’ కావడం ఎంతో అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజని, ఎన్టీఆర్-బసవతారకంలకు తన నివాళులర్పిస్తున్నానని, వారి ఆశీస్సులు తనకు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.  

More Telugu News