India: ఫాలో ఆన్ ఆడించాలని ఇండియా నిర్ణయం... మూడు దశాబ్దాల తరువాత ఘోరమైన స్థితిలో ఆసీస్!

  • 1988 తరువాత ఆసీస్ ఆడుతున్న తొలి ఫాలో ఆన్
  • 322 పరుగులు వెనుకబడివున్న ఆసీస్
  • సిరీస్ ను 3-1 తేడాతో గెలవాలని భావిస్తున్న టీమిండియా

తొలి ఇన్నింగ్స్ లో 322 పరుగులు వెనుకబడిన ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఆడించాలని భారత్ నిర్ణయించింది. సిడ్నీ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ కాగా, మూడో టెస్టులో మాదిరిగా భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను ఆడాలని భావించలేదు. ఇక స్వదేశంలో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడటం మూడు దశాబ్దాల తరువాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

1988లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఆపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు, ఇంత ఘోరమైన పరిస్థితిలోకి రావడం ఇదే తొలిసారి. ఇక, నేటి మ్యాచ్ ఇంకా 35 ఓవర్ల పాటు సాగనుండగా, సాధ్యమైనన్ని ఎక్కువ వికెట్లు తీసి ఒత్తిడి పెంచాలన్నది ఇండియా వ్యూహం. ఆపై రేపటిలోగా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసి సిరీస్ ను 3-1 తేడాతో గెలవాలన్నది కోహ్లీ సేన లక్ష్యం.

ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడం దాదాపు అసాధ్యం. ఆసీస్ గెలవడమూ అంతే. ఎటొచ్చీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు, క్రీజులో పాతుకుపోతే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అప్పుడు కూడా ఇండియా 2-1 తేడాతో సిరీస్ ను గెలుస్తుంది. ఆపై ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ను గెలిపించిన తొలి భారత కెప్టెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.

More Telugu News