Uttar Pradesh: యూపీలో స్టింగ్ ఆపరేషన్ కలకలం... లంచం కోరిన ముగ్గురు మంత్రుల కార్యదర్శులు!

  • కాంట్రాక్టర్ వేషంలో వెళ్లిన చానల్ విలేకరి
  • రూ. 40 లక్షల లంచం కోరిన సెక్రెటరీ
  • సిట్ ను ఏర్పాటు చేసిన యోగి సర్కారు
  • ముగ్గురు కార్యదర్శుల అరెస్ట్

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ముగ్గురు మంత్రుల కార్యదర్శులు లంచం అడిగినట్టు తేలడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, వారిని అరెస్ట్ చేసింది. ఓ న్యూస్ చానల్ విధాన సభ ఆవరణలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా, మైనింగ్, ఎక్సైజ్ మంత్రి అర్చనా పాండే, వెనుకబడిన వర్గాల సంక్షేమ మంత్రి ప్రకాష్ రాజ్ భర్, విద్యా మంత్రి సందీప్ సింగ్ కార్యదర్శులు అడ్డంగా దొరికిపోయారు.

రాజ్ భర్ కార్యదర్శి కశ్యప్, ఓ ట్రాన్స్ ఫర్ చేయించేందుకు రూ. 40 లక్షలు అడిగాడు. గనులను కేటాయించేందుకు, స్కూళ్లకు అనుమతులు ఇచ్చేందుకు సంబంధిత మంత్రుల కార్యదర్శులు డీల్స్ మాట్లాడారు. ఈ వ్యవహారం టీవీలో ప్రసారం కావడంతో, ప్రభుత్వం స్పందించి సిట్ ను ఏర్పాటు చేయగా, అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కారణంతో వారిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఓ కాంట్రాక్టర్ వేషంలో వెళ్లిన చానల్ రిపోర్టర్ వారి భాగోతాలను బయటపెట్టాడు.

More Telugu News