charan: 'అజర్ బైజాన్'లో చరణ్ చేసిన ఫైట్ హైలైట్ అవుతుందట!

  • యాక్షన్ సినిమాలపై బోయపాటి మార్కు
  • చరణ్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ 
  • యాక్షన్ ఎపిసోడ్ గురించే ఫిల్మ్ నగర్లో టాక్    

మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. ఇక మాస్ హీరోగా చరణ్ కి వున్న క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో 'వినయ విధేయ రామ' నిర్మితమైంది. చరణ్ .. బోయపాటి కాంబినేషన్లో తొలిసారిగా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించేస్తూ ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా కోసం 'అజర్ బైజాన్'లో ఒక యాక్షన్ ఎపిసోడ్ చేశారట. భారీ క్రేన్లు .. డ్రోన్లు .. అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఈ యాక్షన్ ఎపిసోడ్ ను బోయపాటి చిత్రీకరించాడని అంటున్నారు. అలాంటి ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. బోయపాటి ఇంతవరకూ చేసిన యాక్షన్ సీన్స్ కి మించి ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని గురించే ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు. 

More Telugu News