Andhra Pradesh: భారత్ లో వేలాది ఏళ్ల క్రితమే మిస్సైల్ టెక్నాలజీ.. కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీలే!: ఆంధ్రా వర్సిటీ వీసీ

  • విష్ణుమూర్తి సుదర్శనచక్రం గైడెడ్ టెక్నాలజీనే
  • 100 కుండల్లో కౌరవులు జన్మించారు
  • 106వ సైన్స్ కాంగ్రెస్ లో మాట్లాడిన వీసీ నాగేశ్వరరావు

భారత్ లో వేలాది సంవత్సరాల క్రితమే గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీ ఉందని ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ జి.నాగేశ్వరరావు తెలిపారు. శత్రువులను సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వదిలేవారనీ, అది లక్ష్యాన్ని ఛేదించాక వెనక్కు తిరిగివచ్చేదని వెల్లడించారు. దీనిని బట్టి భారత్ కు గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీ కొత్తకాదని అర్థమవుతుందన్నారు.

పంజాబ్ లోని జలంధర్ లో జరుగుతున్న 106వ సైన్స్ కాంగ్రెస్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కౌరవుల తల్లి గాంధారి గురించి ప్రస్తావించారు. 100 అండాలను వంద కుండల్లో పెట్టి ఫలదీకరించిన తర్వాతే కౌరవులు పుట్టారని తెలిపారు. వారంతా టెస్ట్ ట్యూబ్ బేబీలేనని స్పష్టం చేశారు.

More Telugu News