balakrishna: క్లీన్ 'యు' తెచ్చేసుకున్న 'కథానాయకుడు'

  • 63 గెటప్స్ లో కనిపించనున్న బాలకృష్ణ
  • ముఖ్య పాత్రల్లో భారీ తారాగణం 
  • జనవరి 9న సినిమా విడుదల  

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధానపాత్రధారిగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. ఎన్టీఆర్ సినీ ప్రయాణం 'కథానాయకుడు' పేరుతోను .. రాజకీయ ప్రస్థానం 'మహానాయకుడు' పేరుతోను ప్రేక్షకులను పలకరించనున్నాయి. తాజాగా 'కథానాయకుడు' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను పొందడం విశేషం.

ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన బరిలోకి దిగడానికి సిద్ధమైపోతోంది. విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక .. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలకృష్ణ 63 గెటప్స్ లో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బాలకృష్ణ సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారనే విషయం తెలిసిందే. 

More Telugu News