Andhra Pradesh: రాజకీయాల్లోకి రాబోతున్నా.. టీడీపీలో నేను చేరితే తప్పేంటి?: నటుడు శివాజీ

  • ఏపీ ప్రజల కోసమే నేను పోరాడుతున్నా
  • నాకు టీడీపీలో చేరే హక్కు ఉంది
  • చంద్రబాబుపై కుట్రలు జరుగుతున్నాయి
రాజకీయ అరంగేట్రంపై ప్రముఖ సినీ నటుడు శివాజీ క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం ఉన్నప్పటికీ తన పాత్రను సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా మీరు టీడీపీలో చేరతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు శివాజీ కొంచెం తీవ్రంగానే స్పందించారు. తనకు టీడీపీలో చేరే హక్కు ఉందని ఆయన తెలిపారు. టీడీపీలో చేరడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కుట్రలు జరుగుతున్నాయని శివాజీ పునరుద్ఘాటించారు. తాను ఏపీ ప్రజల కోసం పోరాడుతున్నాననీ, టీడీపీ ప్రభుత్వం కోసం పనిచేయడం లేదని స్పష్టం చేశారు. తనకు అసెంబ్లీలో అధ్యక్షా! అనే హక్కులేదా? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్షం తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం లేదన్నారు. ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్ గరుడ’ అమలు చేయబోతోందని ఆమధ్య శివాజీ చెప్పి, సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
join
sivaji
actor
YSRCP
Jagan

More Telugu News