srimukhi: డబ్బు వల్లే కలసి జీవిస్తున్నాం అనిపిస్తోంది: యాంకర్ శ్రీముఖి

  • మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా? అని నన్ను ఎంతో మంది అడిగారు
  • ఇప్పుడు నాకు అనుభవమైంది
  • మానవత్వం మొత్తం నశించేలోపు.. ప్రపంచం అంతమైతే సంతోషిస్తా
ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే యాంకర్ శ్రీముఖి తీవ్ర ఆవేదనకు గురైంది. సమాజంలో మానవత్వం మంటకలిసి పోతోందంటూ ఆవేదన భరితంగా ట్వీట్ చేసింది. 'మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా? అని గతంలో నన్ను చాలా మంది అడిగారు. కానీ వారి అభిప్రాయంతో అప్పుడు నేను ఏకీభవించలేదు. కానీ, ఇప్పుడు నాకు అనుభవమైంది. మనం కలసి ఉండటానికి, కలసి జీవించడానికి డబ్బే కారణం అనిపిస్తోంది. జనాల్లోని మానవత్వం మొత్తం నశించేలోపు... ఈ ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా' అంటూ ట్వీట్ చేసింది. 
srimukhi
anchor
tollywood

More Telugu News