జగన్ దాడి కేసులో ముగిసిన శ్రీనివాసరావు రిమాండ్.. ఎన్ఐఏకు అప్పగించే అవకాశం!
- నేడు హైకోర్టు ముందు హాజరు
- విజయవాడలో కొనసాగనున్న విచారణ
- గతేడాది అక్టోబర్ 25న జరిగిన దాడి
ఈ నేపథ్యంలో శ్రీనివాసరావును పోలీసులు మరికాసేపట్లో హైకోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తారా? లేక మరోసారి రిమాండ్ కు తరలిస్తారా? అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఏపీలో విజయవాడలోనే ఎన్ఐఏ కోర్టు ఉండటంతో ఈ కేసు విశాఖ నుంచి విజయవాడ పట్టణానికి బదిలీ చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే.