Kalyanram: 'ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు లేడంటే..: కల్యాణ్ రామ్ వివరణ

  • ఏ పాత్ర చేయమన్నా చేసుండేవాడు
  • చిన్న పాత్ర అని అభిమానులు నిరుత్సాహపడుండేవారు
  • తన తమ్ముడికి బాలయ్య ఎంతో గౌరవం ఇచ్చారన్న కల్యాణ్ రామ్
'ఇదుగో ఈ పాత్ర చెయ్యి' అని తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కు తాతయ్య బయోపిక్ లో ఏ పాత్ర ఇచ్చినా చేసుండేవాడని, అదే జరిగితే నందమూరి అభిమానులు ఇంత చిన్న పాత్ర ఇచ్చారా? అని నిరుత్సాహపడే పరిస్థితి వచ్చుండేదని, అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో లేడని నటుడు కల్యాణ్ రామ్ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కల్యాణ్ రామ్, తారక్ కు బాలకృష్ణ ఎంతో గౌరవం ఇచ్చారని, సినిమా పాటల పండగకు ముఖ్య అతిథిగా పిలిపించి, అతని చేతుల మీదుగానే ఆడియోను బయటకు తెచ్చారని గుర్తు చేశాడు. అసలు అంతకన్నా ఇంకేం కావాలని ప్రశ్నించాడు. తాను చిన్నప్పుడు పైలట్ కావాలని అనుకునేవాడినని, బాబాయ్ సినిమాలు చూసిన తరువాతనే నటుడిని కావాలని అనిపించిందని చెప్పాడు.
Kalyanram
Balakrishna
NTR
Tarak
Biopic

More Telugu News