polavaram: పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా పిటిషన్.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

  • ప్రాజెక్టు నిర్మాణానికి సరైన అనుమతులు లేవు
  • స్టాప్ వర్క్ ఆర్డర్ ను పదేపదే ఉల్లంఘించారన్న ఒడిశా
  • మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ సుప్రీం నోటీసులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు విచారించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సరైన అనుమతులు లేవని, స్టాప్ వర్క్ ఆర్డర్ ను పదేపదే ఉల్లంఘించారని విచారణ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం వాదించింది. అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ఒడిశా ఆరోపణలకు సమాధానం చెప్పాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికోసం మూడు వారాల గడువును ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. 
polavaram
Andhra Pradesh
union government
odisha
petetion

More Telugu News