upasana: షూటింగ్ లొకేషన్లో చరణ్ కోసం 'చేప ఫ్రై' తయారుచేసిన ఉపాసన.. వీడియో చూడండి

  • 'వినయ విధేయ రామ' సినిమా లొకేషన్లో ఉపాసన వంటకం
  • భార్యకు సాయం చేసిన చరణ్
  • పక్కనున్న కాలువలో చేపను పట్టుకొచ్చిన చరణ్ అసిస్టెంట్
తన భర్త, హీరో రాంచరణ్ కు సంబంధించిన ఎన్నో విషయాలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం తెలిసిందే. తాజాగా, 'వినయ విధేయ రామ' సినిమా లొకేషన్లో చరణ్ కోసం ఆమె చేప ఫ్రై తయారు చేశారు. ఉప్పును వాడకుండా... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఆమె ఈ డిష్ ను తయారు చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఆ తర్వాత ఫిష్ కు తోడుగా బంగాళాదుంప, వెల్లుల్లిలను ఆమె జత చేశారు. మరో విషయం ఏమిటంటే పక్కనున్న కాలువ నుంచి చరణ్ అసిస్టెంట్ ఈ చేపను పట్టుకొచ్చాడు
upasana
fish
fty
vvr
shooting location
ram charan
tollywood

More Telugu News