Telangana: తెలంగాణ గవర్నర్ కేసీఆర్ కు భజన చేస్తున్నారు.. దీనిపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తాం!: వీహెచ్

  • నరసింహన్ ను బాధ్యతల నుంచి తప్పించాలి
  • ఆర్డినెన్స్ తో బీసీలకు అన్యాయం చేశారు
  • మీడియా సమావేశంలో వి.హనుమంతరావు
తెలంగాణ గవర్నర్ నరసింహన్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. కేసీఆర్ కు ఆయన భజన చేస్తున్నారని విమర్శించారు. ఆయన్ను వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నరసింహన్ వ్యవహారశైలిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఫిర్యాదు చేస్తామమని పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్ తెచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.
Telangana
KCR
TRS
VH
Congress

More Telugu News