anil ravipoodi: నాకు ఏ హీరోయిన్ తోను ఎఫైర్ లేదు: దర్శకుడు అనిల్ రావిపూడి

  • నేను ఎవరినీ రికమెండ్ చేయలేదు
  • నేనేంటో నా వాళ్లకు తెలుసు 
  • పుకార్లను పట్టించుకోను

'పటాస్'.. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' ఇలా వరుస హిట్లతో అనిల్ రావిపూడి దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎఫ్ 2' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అనిల్ రావిపూడికి ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ ని తీసుకోమంటూ మిగతా దర్శకులకి ఆయన రికమండ్ చేస్తున్నాడనే ప్రచారం జరిగింది.

తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. "నాకు ఏ హీరోయిన్ తోను ఎఫైర్ లేదు .. ఎవరినీ రికమెండ్ చేసిందీ లేదు. నేను ఎలాంటివాడినన్నది నా కుటుంబసభ్యులకు తెలుసు .. నా స్నేహితులకు తెలుసు. నేను తప్పు చేశాను అనిపిస్తే మా ఇంట్లో వాళ్లకి సమాధానం చెబుతాను. ఇంతవరకూ నాకు అలాంటి అవసరం రాలేదు. పనిలేని వాళ్లు పుకార్లను పుట్టిస్తూనే వుంటారు .. వాటిని ప్రచారం చేస్తూ ఆనందాన్ని పొందుతుంటారు. అలాంటి పుకార్లను నేను ఎంతమాత్రం పట్టించుకోను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News