mammootty: 'యాత్ర'లో వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు.. లుక్ విడుదల!

  • మమ్ముట్టి ప్రధాన పాత్రగా 'యాత్ర'
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు 
  • ఫిబ్రవరి 8వ తేదీన విడుదల  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' రూపొందుతోంది. మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, మహి.వి రాఘవ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన మమ్ముట్టి పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి జగపతిబాబు పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు.

ఇందులో ఆయన రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన గెటప్ ఇది. ప్రస్తుతం జగపతిబాబుకి గల క్రేజ్, ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని చెప్పవచ్చు. 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. వైఎస్ అభిమానులంతా ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. 

More Telugu News