సెంచరీ సాధించి సత్తా చాటిన పుజారా... పెరుగుతున్న స్కోరు!

03-01-2019 Thu 11:30
  • సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు
  • 199 బంతుల్లో పుజారా సెంచరీ
  • భారత స్కోరు 243/4
ఛటేశ్వర్ పుజారా మరోసారి భారత క్రికెట్ కు అండగా నిలిచాడు. సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజున తన కెరీర్ లో 18వ సెంచరీని, ఈ సిరీస్ లో 3వ సెంచరీని నమోదు చేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 199 బంతులాడిన పుజారా 13 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 77 పరుగులతో రాణించాడు. కేఎల్ రాహుల్ 9, కోహ్లీ 23 పరుగులు చేసి అవుట్ కాగా, ప్రస్తుతం పుజారాకు తోడుగా హనుమ విహారి 8 పరుగులతో ఆడుతున్నాడు. భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 243 పరుగులు.