Andhra Pradesh: చంద్రబాబుతో సమావేశమైన సబ్బం హరి.. టీడీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్!

  • ఈ రోజు ఉదయం చంద్రబాబుతో భేటీ
  • విశాఖ పార్లమెంటు స్థానం కోరిన నేత
  • కుదరకుంటే విశాఖ నార్త్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. తాజాగా పార్లమెంటు మాజీ సభ్యుడు సబ్బం హరి ఈరోజు సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. టీడీపీలో చేరేేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చంద్రబాబుకు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంటు సీటు కానీ, విశాఖ నార్త్ అసెంబ్లీ టికెట్ కానీ కేటాయించాలని సీఎంను కోరారు.

కాగా, టీడీపీలో చేరుతానన్న సబ్బం హరి ప్రతిపాదనకు పార్టీ అధినేత చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఏపీ విభజన తర్వాత సబ్బం హరి కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వైసీపీలో చేరుతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకున్నారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Congress
join
sabbam hari

More Telugu News