ram: తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్న రామ్

  • పూరి దర్శకత్వంలో రామ్ 
  • కథానాయికగా తెలుగు అమ్మాయి
  • ఈ సాయంత్రమే రానున్న ఫస్టులుక్

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో .. ఆయన సొంత బ్యానర్లో ఒక సినిమా రూపొందనుంది. కథా కథనాల్లోని కొత్తదనం కారణంగా ఈ సినిమా చేయడానికి రామ్ అంగీకరించినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో పూరి కూడా వున్నాడు. ఈ సినిమాకి ముందుగా 'పండుగాడు' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. తాజాగా 'ఇస్మాట్ శంకర్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది.

పాత్ర పరంగా ఈ సినిమాలో రామ్ తెలంగాణ యాస మాట్లాడతాడట. ఇంతవరకూ తాను చేసిన వైవిధ్యభరితమైన పాత్రల జాబితాలో ఈ పాత్ర చేరుతుందనే నమ్మకంతో రామ్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం, పూరి కనెక్ట్స్ ద్వారా ఒక తెలుగు అమ్మాయిని ఎంపిక చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమా టైటిల్ ను .. ఫస్టులుక్ పోస్టర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. 

More Telugu News