India: ఆచితూచి ఆడుతూ... భారీ స్కోరుపై కన్నేసిన భారత్!

  • సిడ్నీలో ప్రారంభమైన నాలుగో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • ప్రస్తుతం స్కోరు 133/2

సిడ్నీలో ఈ ఉదయం ప్రారంభమైన నాలుగో టెస్టులో గెలుపే లక్ష్యంగా భారత ఇన్నింగ్స్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 పరుగులే చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ రాహుల్ వరుసగా రెండో టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 112 బంతులాడిన మయాంక్, 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 77 పరుగులు చేశాడు.

అతనికి వన్ డౌన్ లో వచ్చిన పుజారా నిలదొక్కుకుని సహకరించడంతో మంచి పునాది పడింది. ప్రస్తుతం పుజారా 34 పరుగులు, కోహ్లీ 6 పరుగులతో క్రీజులో ఉండగా, భారత స్కోరు 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్, లియాన్ లకు చెరో వికెట్ లభించాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే 3-1 తేడాతో, కనీసం డ్రా చేసుకుంటే 2-1 తేడాతో ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్టు సిరీస్ ను ఇండియా గెలుచుకుంటుంది.

More Telugu News