Chandrababu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఏదీ?: చంద్రబాబును నిలదీసిన ఉండవల్లి

  • శ్వేతపత్రాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి
  • ఎల్‌ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ కుంభకోణం
  • శ్వేతపత్రాలపై చర్చకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోమారు విరుచుకుపడ్డారు. చంద్రబాబు వరుసపెట్టి విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని దుయ్యబట్టారు. శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్‌ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఇన్నింటిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే ఆ క్రెడిట్‌ను చంద్రబాబు కొట్టేయాలని చూశారన్న ఉండవల్లి తెలంగాణలో ఆయన ప్రచారానికి వెళ్లకుండా ఉండి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అన్నారు.

More Telugu News