venkatesh: 'ఎఫ్ 2'లో అతిథి పాత్రలో అనిల్ రావిపూడి

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • జనవరి 12వ తేదీన విడుదల  

యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ అనిల్ రావిపూడి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. 'పటాస్'.. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' ఆయన దర్శక ప్రతిభకు అద్దం పడుతుంటాయి. తాజాగా ఆయన 'ఎఫ్ 2' సినిమాను రూపొందించాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నిర్మితమైన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి అతిథి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. గతంలో ఆయన 'రాజా ది గ్రేట్' సినిమాలో ఒక పాటలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ కావడంతో సెంటిమెంట్ గా తీసుకున్నాడో ఏమో 'ఎఫ్ 2'లోను కనిపించనున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, కథానాయికలుగా తమన్నా .. మెహ్రీన్ కనువిందు చేయనున్నారు.

More Telugu News