Telangana: కొత్త ఏడాదిని కిక్కెక్కించారు.. డిసెంబరు 31న రూ.133 కోట్ల మద్యం తాగేశారు!

  • మద్యం విక్రయాల్లో హైదరాబాద్ ఫస్ట్
  •  2018లో రూ. 20 వేల కోట్ల మద్యం ఉఫ్
  • ఒక్క చివరి వారంలోనే రూ.600 కోట్ల విక్రయాలు

తెలంగాణలోని మందుబాబులు నూతన సంవత్సరానికే కిక్కెక్కేలా ఆహ్వానించారు. డిసెంబరు 31న ఏకంగా రూ. 133 కోట్ల మద్యాన్ని పొట్టలో పోసేసుకున్నారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా సమకూరింది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు రూ. 50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అయితే, సోమవారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా రూ. 133 కోట్ల విక్రయాలు జరిగాయి. అంతేకాదు, డిసెంబరు చివరి వారంలో రూ.600 కోట్లకుపైగా విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 19.5 కోట్ల మద్యం అమ్ముడుపోగా, రంగారెడ్డిలో రూ.15.30 కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ. 18 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.11.90 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మొత్తంగా రూ. 20 వేల కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా ఒక్క డిసెంబరులోనే ఏకంగా రూ. 1,962 కోట్ల మద్యం అమ్ముడుపోవడం విశేషం.

More Telugu News