Pawan Kalyan: విజయవాడ నుంచే ఎన్నికల ప్రచారం: పవన్ కల్యాణ్

  • కొత్త సంవత్సరంలో ఏపీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి
  • కష్టపడి జనసేనను గెలిపించుకుందాం
  • ఇది వాస్తవ రూపం దాల్చాలని కోరుకుంటున్నా
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని విజయవాడ నుంచే ప్రారంభిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కొత్త సంవత్సరంలో ఏపీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని... ఇందులో జనసేన కీలకపాత్ర పోషించాలని చెప్పారు. అందరం కష్టపడి పనిచేసి, జనసేనను గెలిపించుకుందామని తెలిపారు. ఇది వాస్తవ రూపం దాల్చాలని కోరుకుంటున్నానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
Pawan Kalyan
election
campaign
vijayawada
janasena

More Telugu News