ravibabu: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'ఆవిరి' ఫస్టులుక్

  • 'అవును'తో మెప్పించిన రవిబాబు
  • మరో హారర్ థ్రిల్లర్ కి రంగం సిద్ధం 
  • ఉత్కంఠను పెంచుతోన్న రవిబాబు

రవిబాబు మంచి నటుడే కాదు .. విభిన్నకథా చిత్రాల దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఆసక్తిని రేకెత్తించేవిగా .. ఉత్కంఠను కలిగించేవిగా ఉంటాయి. అలాంటి రవిబాబు నుంచి మరో సినిమా వస్తోంది .. ఆ సినిమా పేరే 'ఆవిరి'. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.

న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు. తనని తాను మరిచిపోయి నాట్యం చేస్తోన్న ఓ యువతిని గాజు సీసాలో ఒక రాక్షసుడు బంధిస్తునట్టుగా ఈ పోస్టర్లో చూపించారు. పోస్టర్ ను బట్టి ఇది సస్పెన్స్ తో కూడుకున్న హారర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. గతంలో 'అవును' సినిమాతో మెప్పించిన రవిబాబు, మరోమారు ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నాడన్న మాట. 

More Telugu News