చెన్నై మెరీనా బీచ్ లో ఇసుక గూళ్లు కడుతున్న ధోనీ... వీడియో!
- నిన్న చెన్నైకి వచ్చిన ధోనీ
- కుమార్తె జీవాతో కలిసి మెరీనా బీచ్ కు
- తన బిడ్డతో ఆడుకుంటున్న జార్ఖండ్ డైనమైట్
అక్కడ ఇసుకలో గూళ్లు కట్టాడు. గుంత తీసి, తన కుమార్తెను అందులోకి దింపి, గూడు కట్టాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఐపీఎల్ పోటీల్లో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న సంగతి తెలిసిందే. మేనేజ్ మెంట్ తో ఏర్పాట్లు, ఆటగాళ్లకు శిక్షణ తదితర అంశాలపై చర్చించేందుకే ధోనీ చెన్నైకి వచ్చినట్టు తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు.