ఎస్యూవీని తుక్కు తుక్కు చేసిన రెండు ట్రక్కులు... ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం!

31-12-2018 Mon 09:16
  • గుజరాత్ లోని భచావ్ సమీపంలో ప్రమాదం
  • అదుపుతప్పి 11 మంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు
  • మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న విజయ్ రూపానీ

గుజరాత్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం పాలైన ఘటన గుజరాత్ లో జరిగింది. కచ్ జిల్లాలోని భచావ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఉప్పు లోడుతో వెళుతున్న ట్రక్కు, అదుపుతప్పి, డివైడర్ ను దాటి అవతలికి వెళ్లి, 11 మంది ప్రయాణిస్తున్న ఎస్యూవీని ఢీకొట్టగా, అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఇంకో ట్రక్కు కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో భుజ్ లోని తమ స్వగ్రామానికి వెళుతున్న కుటుంబంలోని 10 మంది మరణించారు. ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.