karthi: ఆకట్టుకుంటోన్న 'దేవ్' లిరికల్ వీడియో సాంగ్

  • 'ఖాకీ'తో హిట్ కొట్టిన జోడీ 
  • 'దేవ్' గా ప్రేక్షకుల ముందుకు
  • సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్ 

కార్తీ కథానాయకుడిగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో 'దేవ్' సినిమా నిర్మితమైంది. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక తమిళ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హృదయానికి హత్తుకునేలా ఈ మెలోడీ సాంగ్ సాగింది. నాయకా నాయికల మధ్య ప్రేమభావనలు ఆవిష్కరించేదిగా తెరపై ఈ సాంగ్ వస్తుందని అనిపిస్తోంది.

గతంలో కార్తీ .. రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' తమిళంతో పాటు తెలుగులోను విజయాన్ని దక్కించుకుంది. అందువలన ఇప్పుడు కూడా తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ వుంది .. రకుల్ కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఇది తెలుగులో భారీ వసూళ్లనే సాధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జోడీకి మరో హిట్ దొరుకుతుందో లేదో చూడాలి మరి. 

More Telugu News