Andhra Pradesh: ఆంధ్రా మీద కేంద్రానికి ఎంత కక్ష ఉందో విశాఖ ఎయిర్ షో రద్దుతో అర్థమవుతోంది!: చంద్రబాబు

  • హైకోర్టును సమయం ఇవ్వకుండా విభజించారు
  • అమరావతికి వచ్చేందుకు విమానాలు లేవు
  • కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన చంద్రబాబు

ఉద్యోగులు పడే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులు వెళ్లేందుకు కనీస సమయం కూడా ఇవ్వకుండా హైకోర్టును విభజించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రారంభానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ, ఉద్యోగులు ఇప్పటికిప్పుడు రావడం కష్టమని అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఈరోజు కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అమరావతికి వచ్చేందుకు ప్రస్తుతం కనీస విమాన సర్వీసులు లేవని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టచివరి నిమిషంలో ‘విశాఖ ఉత్సవ్’ ఎయిర్ షోను రద్దు చేశారంటే ఏపీపై కేంద్రం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. 2019 నాటికి పోలవరం ద్వారా పంటపొలాలకు నీళ్లు అందిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఉద్యాన పంటల్లో కరవు జిల్లా అయిన అనంతపురం అగ్రస్థానంలో నిలిచిందని చంద్రబాబు ప్రశంసించారు. రాయలసీమలో నీటిని సరిగ్గా వాడుకుంటే ఉద్యానవన పంటలకు హబ్ గా మారుతుందని జోస్యం చెప్పారు.

More Telugu News