hanu raghavapudi: 'లై' విషయంలో అంతా హడావిడి అయింది: హను రాఘవపూడి

  • 'లై' విదేశీ నేపథ్యంలో సాగే కథ
  •  వీసాలు రావడం ఆలస్యమైంది 
  • ముందుగానే రిలీజ్ డేట్ ఇవ్వడం జరిగింది    

నితిన్ హీరోగా ఆ మధ్య హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'లై' సినిమా పరాజయం పాలైంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో హను రాఘవపూడి మాట్లాడుతూ ఆ సినిమాను గురించి ప్రస్తావించారు. "కథ పరంగా 'లై'ను యూఎస్ లో చిత్రీకరించాలి. జనవరిలో మేము యూఎస్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాము. షూటింగ్ మొదలుకాక మునుపే విడుదల తేదీగా ఆగస్టు 11ను ప్రకటించడం జరిగిపోయింది.

వీసాలు ఆలస్యంగా రావడంతో జనవరిలో యూఎస్ వెళ్లవలసిన మేము .. ఏప్రిల్లో వెళ్లాము. యూఎస్ లో 67 రోజులపాటు షూటింగ్ చేశాము. ఇండియాకి వచ్చాక 26 రోజుల పాటు షూట్ చేశాము. విదేశాల్లో చిత్రీకరించే కథ కావడం వలన .. వీసాలు రావడం ఆలస్యం కావడం వలన .. ముందుగానే విడుదల తేదీని ఖరారు చేసుకోవడం వలన హడావిడి అయింది. అందువలన ఆ సినిమాను నేను ముందుగా చూసుకునే అవకాశం లేకుండగా పోయింది" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News