TV: టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్.. చానళ్లను ఎంపిక చేసుకునేందుకు గడువు పెంపు

  • ప్రసార సంస్థలు, ఎంఎస్‌వోలతో ట్రాయ్ సమావేశం
  • జనవరి 31 వరకు గడువు పెంపు
  • తప్పుడు ప్రచారంతో ఆందోళనలు
టీవీ వీక్షకులకు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) గుడ్ న్యూస్ చెప్పింది. నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకునే గడువును మరో నెల రోజులు పొడిగించింది. ప్రసార సంస్థలు, డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో గురువారం సమావేశం అయిన అనంతరం ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త విధివిధానాలను అమలు చేసేందుకు అందరూ అంగీకరించినట్టు ట్రాయ్ కార్యదర్శి ఎస్‌కే గుప్తా తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం పంపిణీ ఆపరేటర్లకు వచ్చే నెల 31 వరకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. కొత్త నిబంధన వల్ల టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన చానళ్లను చూసుకునే అవకాశం లభిస్తుందని, భారం తక్కువగా ఉంటుందని అన్నారు. ఈ విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారని గుప్తా పేర్కొన్నారు.
TV
DTH
SMOs
TRAI
TV audience
India

More Telugu News