Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'సైలెన్స్' చెబుతున్న అనుష్క!
  • త్రివిక్రమ్ తో సినిమాను ధ్రువీకరించిన చిరంజీవి 
  • మరో చిత్రానికి ఓకే చెప్పిన సాయిధరం తేజ్
*  అందాల అనుష్క త్వరలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనుంది. మాధవన్ హీరోగా నటించే ఈ చిత్రానికి 'సైలెన్స్' అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం.
*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా నిన్న రాత్రి జరిగిన 'వినయ విధేయ రామ' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తారని చిరంజీవి చెప్పారు.
*  ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'చిత్రలహరి' సినిమాలో నటిస్తున్న సాయిధరం తేజ్ తాజాగా మరో చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. 'పిల్లజమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సాయి నటిస్తాడని తెలుస్తోంది.
Anushka Shetty
chiranjivi
Trivikram
Saidharam
Ashok

More Telugu News