nitin gadkari: ఇక వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి .. ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలు!

  • పార్లమెంటులో లిఖితపూర్వకంగా తెలిపిన గడ్కరీ
  • గత ఏడాది జూన్ 5న నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి
  • ఈ నంబర్ ప్లేట్లతో నకిలీ నంబర్లకు కూడా అడ్డుకట్ట

వాహనదారులకు హెచ్చరిక. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ ట్యాంపర్ ప్రూఫ్ నంబర్ ప్లేట్లు ఉండాల్సిందే. ఈ విషయాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే వాటిపై అధికారిక హోలోగ్రామ్ కలిగిన స్టిక్కర్ కూడా ఉండాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

గత ఏడాది జూన్ 5న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని గడ్కరీ చెప్పారు. రాష్ట్రాల రవాణా శాఖలు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్, ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రోడ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ ల ప్రతినిధులు కూడా ఆ సమావేశానికి హజరై, తమ ప్రతిపాదనను ఆమోదించారని చెప్పారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వల్ల నకిలీ నంబర్లకు కూడా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. వీటిని తొలగించడం, పునర్వినియోగించడం సాధ్యపడదని చెప్పారు. 

More Telugu News