sensex: అంతర్జాతీయ సానుకూలతలతో లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు

  • 157 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 50 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతం లాభపడ్డ జైప్రకాశ్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి 35,807కు పెరిగింది. నిఫ్టీ 50 పాయింట్లు పుంజుకుని 10,780 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
జైప్రకాశ్ అసోసియేట్స్ (7.00%), సెంట్రల్ బ్యాంక్ (6.59%), పీసీ జువెలర్స్ (4.81%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (4.79%), అజంతా ఫార్మా (4.79%).

టాప్ లూజర్స్:
ప్యూచర్ రీటెయిల్ (-5.37%), డీసీఎం శ్రీరాం (-4.12%), ఎంఫాసిస్ (-3.59%), ఏజీస్ లాజిస్టిక్స్ (-2.96%), రెప్కో హోం ఫైనాన్స్ (-2.70%).

More Telugu News