ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి చంద్రబాబు మరో డ్రామా ఆడారు: బీజేపీ ఎంపీ జీవీఎల్
- రాయేగా పోయిందేముందని వేసేశారు
- ‘చంద్రన్న రాళ్లు’ రాయలసీమలో చాలా వున్నాయి
- బాబు పాలనలో పని తక్కువ.. మోసం ఎక్కువ
‘ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్ కు శంకు స్థాపన చేసి చంద్రబాబు గారు మరొక డ్రామా ఆడారు. రాయేగా పోయిందేముందని వేసేశారు. ఇటువంటి అమలుకు నోచుకోని ‘చంద్రన్న రాళ్లు’ రాయలసీమలో చాలా వున్నాయి. అసలు గనుల వివరాలను అధ్యయనం చేయకుండా, పొందుపరచకుండా సీమ ప్రజలను మరొకసారి మోసం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో పని తక్కువ. మోసం, ఆర్భాటం ఎక్కువ. స్టీల్ ప్లాంట్ విషయంలో చెప్పేవన్నీ అబద్ధాలే. ఒక రాయి పడేసి రాయలసీమను ఉద్ధరిస్తున్నట్లు పెద్ద బిల్డ్ అప్ ఒకటి..’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.