karthikeya: కొత్త సినిమాను మొదలెట్టేసిన 'ఆర్ ఎక్స్ 100' హీరో

  • 'ఆర్ ఎక్స్ 100'తో పడిన హిట్ 
  • సెట్స్ పై ద్విభాషా చిత్రంగా 'హిప్పీ'
  • అర్జున్ జంధ్యాలతో తదుపరి సినిమా 

ఈ మధ్య కాలంలో యూత్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసిన చిత్రాలలో 'ఆర్ ఎక్స్ 100' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాతో హీరోగా కార్తికేయ క్రేజ్ పెరిగింది. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు .. తమిళ భాషల్లో కార్తికేయ 'హిప్పీ' అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కార్తికేయ హీరోగా మరో సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ టెంపుల్లో ఈ సినిమాను లాంచ్ చేశారు. బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా ముహూర్తపు సన్నివేశాన్ని హీరోపై చిత్రీకరించారు. అనిల్ కడియాల .. తిరుమల రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించనున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా టైటిల్ తోపాటు మిగతా విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 

More Telugu News