Narendra Modi: రావణాసురుడి వేషధారణలో టీడీపీ నేత శివప్రసాద్!

  • పార్లమెంటులో టీడీపీ నేతల ఆందోళన
  • ప్రత్యేకహోదా, విభజనహామీలపై పోరాటం
  • మోదీకి 10 లక్షణాలు ఉన్నాయని విమర్శ

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోరుతూ ఈ రోజు టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు శివప్రసాద్ రావణాసురుడి వేషధారణలో పార్లమెంటుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖాలు ఉన్న 10 స్టిక్కర్లను ఆయన తలకు అంటించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రావణాసురుడని విమర్శించారు. ఆయనకు 10 కంటే ఎక్కువ అవలక్షణాలు ఉన్నాయని దుయ్యబట్టారు.

More Telugu News