India: 16 ఏళ్లనాటి రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ!

  • ఒక్కో రికార్డునూ తన పేరిట మార్చుకుంటున్న కోహ్లీ
  • 2002 నాటి రాహుల్ ద్రావిడ్ రికార్డు బద్దలు 
  • ఏడాదిలో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఇక కోహ్లీ

గతంలో నమోదైన ఒక్కో రికార్డునూ తన పేరిట లిఖించుకుంటూ సాగుతున్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో 16 ఏళ్ల నాటి మరో రికార్డును బద్దలు కొట్టాడు. ఏడాది వ్యవధిలో విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. 2002లో విదేశాల్లో 1137 పరుగులను సాధించి రాహుల్ ద్రావిడ్, 1983 నాటి మొహీందర్ అమర్ నాథ్ (1065 పరుగులు) రికార్డును బద్దలు కొట్టగా, 16 సంవత్సరాల తరువాత కోహ్లీ దాన్ని అధిగమించి, 1138 పరుగులు సాధించాడు. ఇదే సమయంలో మరో వ్యక్తిగత రికార్డును కూడా కోహ్లీ నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులను ఆస్ట్రేలియాపై (1573 పరుగులు) సాధించాడు. కోహ్లీ ఇంగ్లండ్ పై 1570, శ్రీలంకపై 1005 పరుగులు చేసి ఉన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో కోహ్లీ 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ చేరిన సంగతి తెలిసిందే.

More Telugu News